మైక్రోసాఫ్ట్ తో ఎస్ బీఐ ఒప్పందం

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగంలో దివ్యాంగ యువతకు అవకాశాలు కల్పించడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, ఎస్బీఐ ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ కోర్టోయిన్ కలిసి మూడేళ్ల ప్రోగ్రామ్ ను లాంచ్ చేశారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా దివ్వాంగులకు టెక్నాలజీలో శిక్షణ అందిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి మొదటి ఏడాదిలో 500 మందికి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల నైపుణ్య సంస్థలు, లాభాపేక్షలేని సంస్థల సహకారంతో నడుస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు, దివ్వాంగులు సరైన నైపుణ్యాలతో ఈ రంగంలో అడుగుపెట్టేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఎస్బీఐ, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.

భారతదేశంలో 26 మిలియన్లకు పైగా దివ్యాంగులు 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా పాల్గొనడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి కొత్త మార్గాలను కనుగొనడం చాలా అవసరం. ఎస్బీఐ ఫౌండేషన్ తో భాగస్వామ్యం చేయడం ద్వారా దివ్వాంగులు బీఎప్ఎఫ్ఐ రంగానికి ప్రయోజనం కలిగించే అద్భుతమైన అవకాశం ఉంది అని కోర్టోయిన్ చెప్పారు. 

Leave a Comment