లాక్ డౌన్ 5.0పై రేపే నిర్ణయం

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ 4.0 ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే దానిపై రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాక్ డౌన్ 4 ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన ప్రణాళికపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం మాట్లాడారు. లాక్ డౌన్ పొడిగింపు అభిప్రాయలను తెలుసుకున్నారు. ఏ రంగాలకు మినహాయింపు అవసరం, ఎలాంటి సమస్యలున్నాయి వంటి అంశాలపై చర్చించారు. 

అయితే మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మరొకన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. లాక్ డౌన్ 5 పై కేంద్రం తుది నిర్ణయాన్ని, శని, ఆదివారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. 

Leave a Comment