కరోనా చైనీస్ బయో వెపనే? లీకైన 6 ఏళ్ల క్రితం నాటి పత్రాలు..!

కరోనా వైరస్ ఏడాదిన్నర కాలంగా ఉధృతంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది.. అయితే ఇప్పటి వరకు కరోనా మూలాలకు కచ్చితమై ఆధారాలు లభించలేదు. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిందన్న ఆరోపణలను చైనా ఖండించింది. 

అయితే కరోనా వైరస్ చైనా తమ జీవాయుధాల లాబరేటరీల్లో తయారు చేసిందని 6 ఏళ్ల క్రితం నాటి డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది.. ఆరేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్ లో చైనా మిలిటరీ శాస్త్రవేత్త ఒకరు మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించారు. సార్స్ వైరస్ జాతి నుంచి తయారు చేసిన జీవాయుధంతో యుద్ధం జరుగుతుందని చైనా ప్రభుత్వ ఆరోగ్య అధికారితో చర్చించినట్లు ఈ పత్రం వెల్లడించింది. 

ఈ డాక్యుమెంట్ ను అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ స్వాధీనం చేసుకుంది. చైనా సైంటిస్టులు పబ్లిక్ హెల్త్ అధికారులు సార్స్ కరోనా వైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. 

ఆస్ట్రేలియన్ నివేదిక ప్రకారం చైనా మిలిటరీ సైంటిస్టు మూడో ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జరుగుతుందని ఆ డాక్యుమెంట్ లో అంచనా వేశారు. కరోనా వైరస్ లను ‘జన్యు ఆయుధాల కొత్త శకంగా కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్ గా మార్చవచ్చని, తర్వాత తరంలో వాడే ఆయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని ఈ పత్రంలో ప్రస్తావించారు.  

 

Leave a Comment