ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తుంటారు. అయితే ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలతోనే చాలా మంది నాయకులు గెలుస్తుంటారు. తాజాగా ఓ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఓ అభ్యర్థి మైండ్ బ్లాక్ అయ్యే హామీలను ప్రకటించాడు.
హర్యానా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. సిర్సాద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్ గ్రామస్తులు కలలో కూడా ఊహించని హామీలను ప్రకటించాడు. ఆయన హామీలకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. ఇంతకు ఆయన ఏం హామీలు ఇచ్చారంటే..
- గ్రామంలో ప్రతిరోజూ సర్పంచ్ చే మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది.
- గ్రామంలో 3 విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది.
- మహిళలకు ఉచిత మేకప్ కిట్ ఇవ్వబడుతుంది.
- సిర్సాద్ లో లీటర్ పెట్రోల్ రూ.20కే ఇస్తాను.
- గ్యాస్ సిలిండర్ రూ.100లకే ఇస్తాను.
- సిర్సాద్ నుంచి ఢిల్లీ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తాను..
- జీఎస్టీ రద్దు చేస్తాను.
- ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఉచితంగా ఇవ్వబడుతుంది.
- గ్రామంలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తాను.
- మద్యం అలవాటు ఉన్న వారికి ఒక బాటిల్ ఆల్కాహాల్ ఫ్రీగా అందిస్తాను.
- 10 కి.మీ. దూరంలో గ్రామానికి ప్రతి 5 నిమిషాలకు ఒక హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తాను.
Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022