ఇదేం పిచ్చిరా బాబు.. సమాధిలో ప్రీవెడ్డింగ్ షూట్..!

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకం..అందుకే పెళ్లి చేసుకునే విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ షూట్ కామన్ అయిపోయింది. కొందరు తీపి గుర్తుగా పెట్టుకోవడానికి ప్రీవెడ్డింగ్ షూట్ జరిపితే.. మరి కొందరు మాత్రం పాపులారిటీ కోసం పిచ్చి చేష్టలు చేస్తున్నారు. డిఫరెంట్ గా ట్రై చేస్తూ ప్రీవెడ్డింగ్ షూట్ అనే పదాన్నే మర్చేస్తున్నారు.. 

 అయితే, తాజాగా ఓ జంట తమ ప్రీవెడ్డింగ్ షూట్ ను వింతగా జరుపుకుంది. ఆ వింత వెడ్డింగ్‌ షూట్‌కు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో నూతన వధూవరులు ఏకంగా శ్మశానంలో వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించారు. అంతటితో ఆగకుండా అక్కడ ఐదు అడుగుల సమాధి గొయ్యి తీయించుకున్నారు. అందులో కాబోయే వధవు, వరుడు చనిపోయినట్లు సమాధిలో పడుకుని ఫోజులిచ్చారు. 

జీవిత చివరి అంకంలో అందరు ఇక్కడే కదా పడుకునేది. అందుకే ఇప్పుడే ఇలా చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారేమో.. ఏకంగా సమాధిలో పడుకుని ఫోటో షూట్ చేశారు. ఇక ఈ ఫొటో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు. ఏంచక్కా పెళ్లి చేసుకునే సమయంలో ఇదేం రోగం, ఇదేం పైత్యం అంటూ ఫైర్ అవుతున్నారు. మరి వీరు చేసిన ఈ పనికి మీ కామెంట్ ఏంటో చెప్పండి..

Leave a Comment