వారికి ఇసుక ఉచితం..

ఏపీ ప్రభుత్వం ఇసుక పాలసీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసింది. ఇందులో భాగంగా బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కూడా ఇసుక ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది. హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ఇళ్ల నిర్మానాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలు చేసింది. కాగా, వాగులు, వంకలు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఇందు కోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది. 

Leave a Comment