టీవీ చూస్తూ వారానికి రూ.65,600 జీతం..

మీకు TV చూడటం అంటే ఇష్టమా? అయితే TV చూడటమే ఉద్యోగం అయితే ఎలా ఉంటుంది? భలేగా ఉంటుంది కదూ..ఎంచక్కా TV చూసుకుంటా సంపాదించవచ్చు..అవునండి ఒక టెక్ సంస్థ కేవలం TV చూసే వారి కోసం వెతుకుతోంది. జస్ట్ టీవీ చూస్తూ గంటకు రూ.3,281 చొప్పున పొందవచ్చు.

యూకేకు చెందిన OnBuy అనే సంస్థ ఈ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దీని కోసం కేవలం మంచి రచనా శైలితో పాటు ఇంగ్లీష్ లో నైపుణ్యం ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వారానికి కనీసం 20 గంటలు పని చేయాల్సి ఉంటుంది. జీతం గంటకు రూ.3,281 చెల్లిస్తుంది. అంటే మీరు ప్రతి వారం రూ.65,600 సంపాదించవ్చు. ఈ ఉద్యోగాన్ని ‘Tech Tester’గా పిలుస్తారు. 

అసలు పని ఏంటంటే… టీవీలు, కెమెరాలు, స్మార్ట్ పరికరాలు, సిస్టమ్స్ తో పాటు పలు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అభిప్రాయాన్ని అందించాలి. దాని పనితనం, డిజైన్, లోటుపాట్ల గురించి రాసి పంపించాలి. ధరకు తగినట్లుగా ఆ వస్తువులు పని చేస్తున్నాయా లేదా అని ఆ ప్రొడక్టు గురించి 200 పదాలతో సమీక్ష రాయాలి. అయితే సంస్థలో పని చేసే వారికి ఎలక్ట్రానిక్ వస్తువులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. వినియోగదారులు ఎలాంటి వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిసి ఉండాలని సంస్థ ప్రతినిధి తెలిపారు. 

 

Leave a Comment