పెట్రో బాదుడు..20వ రోజూ పెరిగిన ధరలు..

లాక్ డౌన్ దెబ్బకు అల్లాడుతున్న సామాన్యులకు పెట్రో సాక్ లు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల లీటర్ కు 21 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ.80.13కు, డీజిల్ లీటర్ కు 80.19 పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.82.96కు, డీజిల్ రూ.78.19కి చేరింది.  

గత 20 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.8.93 పెరగగా, డీజిల్ లీటర్ కు రూ.10.07 పెరిగింది. దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాల వల్లే ఆయా చోట్లలో ధరలు మార్పు ఉంటుందని చమురు కంపెనీలు చెబెతున్నాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కరోనా సమయంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వాపోతున్నారు. 

క్రూడాయిల్ తగ్గినా..ఎక్సైజ్ డ్యూటీతో బాదుడు..

పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. 2014లో ఏప్రిల్ నెలలో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లు ఉండేది. ఆ సమయంలో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.55 ఉండేది. బేస్ ప్రయిస్, డీలర్ కమీషన్ కలుపుకుని రూ.45.5 ఉంటే కేంద్ర రూ.10 టాక్స్ రూపంలో వసూలు చేసేది. లీటర్ డీజిల్ కోసం ఖర్చు పెట్టే నగదుకు 18 శాతం టాక్స్ ను ప్రభుత్వం వసూలు చేసేది.

కానీ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 42 డాలర్లు మాత్రమే ఉంది. జూన్ 16 ప్రయిస్ బ్రేక్ అప్ ప్రకారం..డీజిల్ ధర రూ.75 ఉంది. ఇందులో బేస్ ప్రయిస్, బాడుగ, డీలర్ కమీషన్ కలుపుకుని రూ.25.76 కాగా, దీనిపై అదనంగా రూ.50 కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. ఈ లెక్కన ప్రతి లీటర్ డీజిల్ కొనుగోలు ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, దానిపై 66 శాతం పన్నుల రూపంలో కేంద్ర భారం మోపుతోంది. 

ఆరేళ్లలో క్రూడ్ ఆయిల్ 60 శాతం తగ్గినా..డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ 8 రెట్టు పెరిగింది..

 

2014 ఏప్రిల్2020 జూన్మార్పు(శాతాల్లో)
క్రూడ్ ఆయిల్105 డాలర్లు42.75 డాలర్లుమైనస్ 60 శాతం
పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీరూ.9.48రూ.32.98248 శాతం
డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీరూ.3.56రూ.31.83794 శాతం

 

Leave a Comment