మోడీపై సమంత కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..అసలు ఏమైంది?

స్టార్ హీరోయిన్ సమంతపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంపై గతంలో సమంత చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాని మోడీపై సమంత గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంత బీజేపీకి, ప్రధాని మోడీకి తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. 

దీంతో సమంత గతంలో ప్రధాని మోడీపై చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. క్రికెటర్ అమిత్ కుమార్ ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో సామ్ ఏం చెప్పిందంటే.. తాను ఎల్లప్పుడు మోడీ సపోర్టర్ అని, ఆయన చేసిన మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించింది. 

మరో వీడియోలో తాను మోడీ సపోర్టర్ అని, ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నానని, ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారని, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారని సామ్ చెప్పింది. సమంత చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎల్పీజీ సిలిండర్ రూ.1100 అయ్యింది.. ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా? అంటూ ఫైర్ అవుతున్నారు. 

 

 

 

Leave a Comment