ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం.. భార్య స్నానం చేస్తున్న వీడియో పెట్టిన ఘనుడు..!

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఓ వ్యక్తి నీచమైన పనికి ఒడిగట్టాడు. తన భార్య పర్సనల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో నివాసం ఉండే 28 ఏళ్ల వ్యక్తి ఈ దారుణమైన పనిచేశాడు. ఆ వ్యక్తి ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. 

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కి చెందిన 28 ఏళ్ల వ్యక్తికి సోషల్ మీడియా అంటే విపరీతమైన పిచ్చి.. ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ మునిగి తేలుతాడు. తన పేజిలో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అతడికి ఫాలోవర్స్ మాత్రం పెరడం లేదు. 

ఆ వ్యక్తికి పెళ్లయింది. అతడి భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఉంటుంది. ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు స్నానం చేస్తుండగా వీడియో కాల్ మాట్లాడుకుందామని భార్యను బలవంతం చేశాడు. దీంతో అతడి భార్య అందుకు అంగీకరించింది. స్నానం చేస్తూ భర్తతో వీడియో కాల్ మాట్లాడింది. 

ఈ వ్యక్తి ఆ కాల్ ని రికార్డ్ చేశాడు. ఫేస్ బుక్ లో తన పేజీకి ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం తన భార్య స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఆమె వ్యక్తిగత ఫొటోలను కూడా పెట్టడం ప్రారంభించాడు. అయితే ఓ రోజు ఫేస్ బుక్ చూస్తుండగా.. తన వ్యక్తిగత ఫొటోలను భార్య గమనించింది. ఈ విషయంపై భర్తను నిలదీసింది. ఆ ఫొటోలను, వీడియోను తీసేయాలని కోరింది. అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఫేస్ బుక్ సంస్థను ఆశ్రయించి.. అతడి ఫేస్ బుక్ పేజిని, అకౌంట్ ని డిలీట్ చేయించారు.. 

Leave a Comment