మీ రైలు ఆలస్యం అయితే.. ఈ సేవలు పూర్తిగా ఉచితం..

మీ జీవితంలో ఏదో ఒక సమయంలో రైలు ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదర్కొని ఉంటారు. రైలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని హక్కులను అందిస్తోంది. రైలు ఆలస్యమైనప్పుడు IRCTC మీకు ఉచితంగా ఆహారం అందిస్తుంది. రైలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా వచ్చినప్పుడు IRCTC ఉచితంగా ఆహారం, శీతల పానీయాన్ని కూడా అందిస్తుంది.

 IRCTC క్యాటరింగ్ నిబంధనల ప్రకారం.. రైలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రయాణికులకు అల్పాహారం, తేలికపాటి భోజనం ఉచితంగా అందిస్తారు. ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులో ఉంటుందంటే.. రైలు అర గంట ఆలస్యమైతే ఈ సౌకర్యం ఇవ్వబడదు. రైలు 2 గంటలు లేదా అంత కంటే ఎక్కువ ఆలస్యం అయితే.. ఎక్స్ ప్రెస్ రైళ్లలోని ప్రయాణికులకు ఈ సౌకర్యం అందించబడుతుంది.  

ఏం ఇస్తారంటే..

IRCTC ప్రకారం.. రైలు ఆలస్యం అయితే అల్పాహారంలో టీ లేదా కాఫీ, రెండు బిస్కెట్లు 4 బ్రెడ్ స్లయిస్ లు, సాయంత్రం స్నాక్స్ లో ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. భోజనంలో అన్నం, పప్పు, ఊరగాయ ప్యాకెట్లు లేదా ఏడు పూరీలు, మిక్స్ డ్ వెజ్ లేదా బంగాళ దుంప భాజీ, ఊరగాయ ప్యాకెట్ ఇస్తారు. 

 

Leave a Comment