సమంత బ్యాగ్, షూ ధర అన్ని లక్షలా?

అక్కినేని కోడలు సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో అలరిస్తోంది.. ఫ్యాషనిస్ట్ కి ఐకాన్ పేరు పొందారు. తన అందచందాలతో అలరిస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

తాజాగా లూయిస్ విట్టన్ షూట్ కి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఆ బ్రాండ్ దుస్తులు, బూట్లు, ఇతర ఉపకరణాలతో ఈ ఫొటో షూట్ చేసింది.  బ్లాక్ బ్రాలెట్ లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. సమంత ధరించిన బ్యాగ ధర రూ.2.5 లక్షలు కాగా, బూట్ల విలువ రూ.1.5 లక్షలు మాత్రమేనని సమాచారం. లూయిస్ వీట్టన్ ప్రమోషన్స్ కోసం సమంత భారీ కంట్రాక్ట్ కుదుర్చుకుందని తెలిసింది.

కాగా సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కొద్ది రోజులుగా తమిళ చిత్రంతో బిజీగా ఉంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.      

 

Leave a Comment