12 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల యువతి పెళ్లి.. ఫొటోలు వైరల్..!

ఇప్పటి వరకు చిన్నారి పెళ్లి కూతురి గురించి మాత్రమే విన్నాం.. అయితే చిన్నారి పెళ్లి కొడుకు గురించి వినలేదు. ఇలాంటి పెళ్లి కర్నూలు జిల్లా కర్నాటక సరిహద్దు మండలం కౌతాళం సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. 12 ఏళ్ల బాలుడికి 30 ఏళ్ల యువతితో పెళ్లి చేశారు. ఈ వార్త కొంచెం పాతదే అయినా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ పెళ్లి చేయడానికి ఓ కారణం ఉందట..తాను మరణిస్తే కుమారుడు ఏమవుతాడో అన్న బెంగ ఓ తల్లికి కలిగింది. మద్యానికి బానిసైన భర్త తన కుమారులను పట్టించోడనే నిర్ణయానికి వచ్చింది. తన చనిపోతో పిల్లలు అనాధలవుతారని ఫిక్స్ అయింది. ఒక ఇంటి వాడ్ని చేస్తే వారే తన కుమారుడ్ని చూసుకుంటారని భావించింది.

 ఈక్రమంలో దూరపు బంధువుల్లో ఓ యువతిని పెళ్లి చేయాలని నిర్ణయించిది. 30 ఏళ్ల వయస్సున్న యువతితో 12 ఏళ్ల బాలుడి పెళ్లి జరిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాల్య వివాహాలు అరికట్టాలని ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడక్కడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి..  

Leave a Comment