80 ఏళ్ల వయస్సులో ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులు ఇరగదీసిన బామ్మ.. వీడియో వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బుల్లెట్ బండి’ పాటే వినపడుతోంది.ఏ వివాహ వేడుక చూసినా ఈ పాటకు స్టెప్పులు వేయాల్సిందే.. ఇటీవల సిరిసిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఇది మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ఇదే పాటకు ఓ బామ్మ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ జీవితంలో వృద్ధాప్యం శరీరానికే కానీ, మనసు కాదని చాటి చెప్పింది ఓ బామ్మ.. ఒక్కసారిగా ఎయిటీస్ నుంచి ట్వంటీస్ కు వెళ్లిపోయింది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా’ అంటూ 80 ఏళ్ల వయస్సులోనూ తన భర్త ముందు స్టెప్పులేసింది.  తన భర్త ముందు హుషారుగా డ్యాన్స్ చేస్తూ తన ప్రేమను చాటింది. 80 ఏళ్ల వయస్సులోనూ అంత యాక్టివ్ గా స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బామ్మ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బామ్మ డ్యాన్స్ నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. నువ్వు గ్రేట్ బామ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.     

Leave a Comment