హైదరాబాద్ లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..ఆపై హత్య..!

126
Saidabad

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గురువారం సాయంత్రం నుంచి చిన్నారి కనబడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికారు.  అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడి ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. 

వివరాల మేరకు నల్గొండ జిల్లా చందంపే మండలానికి చెందిన రాజు నాయక్ కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ లో స్థిరపడింది. రాజు నాయక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం పాప కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. అయితే ఆమె ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో పరిశీలించినా ఫలితం లేకపోయింది. 

బాధితుల ఇంటి పక్కనే ఉంటున్న రాజు అనే యువకుడు చెబు వ్యసనాలకు అలావటై చిల్లర దొంగతనాలకు పాల్పడేవాడు. వ్యసనాలకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న రాజు కూలీ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ జల్సాలు చేస్తూ తిరిగేవాడు. చివరికి పక్కింట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని పరుపులో మూట కట్టి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. 

నిందితుడు రాజును బహిరంగంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ తరహాలోనే ఈ నిందితుడిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆందోళనకు దిగారు. ఈక్రమంలో పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ వారిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.      

Previous articleఓ వినూత్న ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది..!
Next articleప్రకాశం జిల్లాలో రైతు పొలంలో బయటపడ్డ వినాయక విగ్రహం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here