ఓ వినూత్న ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది..!

చాలా మందికి సొంతంగా ఏదైనా చేయాలని, డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కాని ఏం చేయాలో వారికి సరైన అవగాహన ఉండదు. అయితే సరైన ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా ఓ వినూత్న ఐడియాతో రూ.కోట్లు సంపాదిస్తున్నాడు ఓ యువకుడు. అతడే కేశవ్ రాయ్.. 

అతడు చదువులో టాపర్ కాదు. యావరేజ్ విద్యార్థి. అయినా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండేది. అందుకే వినూత్నంగా ఆలోచించాడు. సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను తయారు చేయాలని ఆలోచన అతనికి వచ్చింది. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. 2016లో బైక్ బ్లేజర్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2017లో అతడి ప్రొడక్ట్ కు పేటెంట్ లభించింది. అంతే తర్వాత తన వ్యాపారంలోకి దూసుకుపోతున్నాడు. 

ద్విచక్రవాహనదారులకు సెమీ ఆటోమెటిక్ బైక్ కవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ బైక్ కవర్ ను వాహనానికి అమర్చితే 30 నిమిషాల్లో కవర్ అవుతుంది. దీని వల్ల వర్షం పడినా వాహనం పొడిగా ఉంటుంది. ఈ కవర్లను రూ.780, రూ.850 ధరలకు అమ్ముతున్నాడు. ఈ-కామర్స్ సైట్లలో ఈ కవర్లు అందుబాటులో ఉన్నాయి.

మొదట్లో ఆ బైక్ కవర్ల అమ్మడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత వాటి గురించి తెయడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. బైక్ కవర్ల గురించి సోషల్ మీడియాలోనూ బాగా ప్రచారం చేశాడు. తక్కువ సమయంలో ఆ బైక్ కవర్లకు మంచి ఆదరణ లభించింది. ఐదేళ్లలో 75 వేలకుపైగా కవర్లను అమ్మాడు. ప్రస్తుతం కేశవ్ ఆదాయం ఏడాదికి రూ.1.30 కోట్లు ఉంది. మొదట తన ఇంటి టెర్రస్ పై ప్రారంభమైన కవర్ల తయారీ పరిశ్రమ.. ఇప్పుడు ఢిల్లి, ఘజియాబాద్ లలో ఏర్పాటు చేశాడు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేశవ్ వెల్లడించాడు. 

Leave a Comment