ప్రకాశం జిల్లాలో రైతు పొలంలో బయటపడ్డ వినాయక విగ్రహం..!

వినాయక చవితి రోజున ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. పొలంలో పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ఈ అద్భుత ఘటన ప్రకాశం జిల్లా మోటుపల్లిలో జరిగింది. మోటుపల్లలో రైతు సిరిపూడి వెంకటేశ్వర్లు పొలం దున్నతుండగా పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం ఎత్తు సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. విగ్రహం బరువు 220 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

విగ్రహంతో పాటు ఆలయ శాసనాలు బయటపడ్డాయి. విగ్రహ శైలి ఆధారంగా చోళుల కాలం నాటి విగ్రహంగా గుర్తించారు. కోదండ రామాలయ పరిసరాల్లో దొరికిన ఈ విగ్రహం 12 శతాబ్దం నాటిదిగా భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని కోదండ రామస్వామి దేవాలయం వద్దకు చేర్చి భద్రపరచాలని మోటుపలల్లి హెరిటేజ్ సోసైటీకి, ప్రభుత్వానికి రైతు కోరుతున్నాడు. వినాయక చవితి నాడే ఈ విగ్రహం బయటపడటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. వినాయక విగ్రహాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

 

Leave a Comment