హీరో కార్తికేయ లవ్ స్టోరీ.. ఎలా మొదలైందో తెలుసా?

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ లోహితతో త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో కార్తికేయ నిశ్చితార్థం జరగ్గా.. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాతరమే హాజరయ్యారు..

తాజాగా కార్తికేయ నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అరే ఒక్క మాటైనా చెకప్పలేదేంటి బ్రో అంటూ అతని అభిమానులు చాలా ఫీలైపోయారు. దీంతో ట్విట్టర్ వేదికగా తన కాబోయే భార్య గురించి, ఆమెను ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలిపాడు. 

‘2010లో నీట్ వరంగల్ లో లోహితా రెడ్డిని తొలిసారి చూశాను. దాదాపు దశాబ్ద కాలం నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న లోహితాతో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే ఆమె తన జీవితంలో భాగం కానుంది.’ అంటూ కార్తికేయ వెల్లడించారు. ఈ సందర్భంగా లోహితతో పదేళ్ల కిందట తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. అయితే లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గర బంధువని కూడా తెలిసింది. కార్తికేయ తన పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఈక్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కార్తికేయ హిప్పీ, గుణ, 369, 90 ఎంఎల్, చావు కబురుచల్లాగా సినిమాల్లో నటించాడు. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినామాలో విలన్ గానూ మెప్పించాడు. కార్తికేయ ప్రస్తుతం అజిత్ వాలిమై, రాజా విక్రమార్క సినిమాల్లో నటిస్తున్నాడు. 

  

Leave a Comment