రాత్రి పూట ఈ ఆహారాలను తీసుకోవద్దు..!

ఆహారాన్ని సరైన సమాయానికి తీసుకోవాలి. లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అజీర్తి, రక్తహీనత, పోషకాహార లోపం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, బరువు, కండరాలు, ఎముకలు, నిద్ర సమస్యలు వస్తాయి. రాత్రి పూట చాలా మంది సహజంగా అతిగా భోజనం చేస్తుంటారు. కొందరు కాఫీలు, టీలు కూడా తాగుతుంటారు. ఆ సమయంలో పని నుంచి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి తగ్గేందుకు అలా చేస్తుంటారు. అయితే నిజానికి రాత్రి పూట కొన్ని రకాల ఆహారాలను తీసుకోరాదు. వాటి వల్ల దుష్పరిణామాలు కలుగుతాయి. రాత్రి పూట తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పూట తినకూడని ఆహారాలు:

  • చిప్స్, వేపుళ్లు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలను రాత్రి పూట అస్సలు తినరాదు. తింటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. వాటిని జీర్ణం చసేందుకు జీర్ణాశయం శ్రమిస్తుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరి పాదాలు వాపులకు గురవుతాయి. కనుక ఈ పదార్థాలను రాత్రి తినరాదు. 
  • కారం, మసాలాలు ఉండే పదార్థాలను కూడా రాత్రి పూట తినరాదు. ఇవి కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. 
  • రాత్రి పూట స్వీట్లు తినరాదు. చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదంతా కొవ్వు కింద మారుతుంది. దీర్ఘకాలికంగా ఇలా చేస్తే అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రాత్రి పూట స్వీట్లను తినకూడదు. 
  • కొందరు రాత్రి పూట టీ, కాఫీలను తాగుతుంటారు. నిద్రను ఆపుకునేందుకు అలా చేస్తారు. రాత్రి విధులు నిర్వర్తించే వారితో పాటు చదువుకునే విద్యార్థులు రాత్రి పూట టీ, కాఫీలను బాగా తాగుతుంటారు. కానీ అవి నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడో ఒకసారి అంటే ఫర్లేదు. కానీ రోజూ అంటే నిద్రలేమి సమస్య వస్తుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. 
  • రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించరాదు. లేదంటే నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫలితంగా డిప్రెషన్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి పూట మద్యం తీసుకోరాదు.
  • అయితే రాత్రి వేళ్ల ఆహారం పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు. కొంత అయినా సరే తినాలి. లేకపోతే చక్కెర స్థాయిలు పడిపోతాయి. 

ఈ వేళలను పాటించండి:

  • ఉదయం నిద్ర లేచిన సుమారు గంట, రెండు గంటల్లోనే అల్పాహారాన్ని తినేయాలి. 
  • ఉదయం 8 నుంచి 9 గంటలకు అల్పాహారాన్ని తినడం మంచిది. 
  • మధ్యాహ్నం 12 లేదా ఒంట గంటకు భోజనం చేయాలి. 
  • రాత్రి 8 గంటల లోపు భోజనం తినేయాలి. 
  • ఈ వేళలను పాటిస్తే.. మీరు ఎంత ఎక్కువ తిన్నా సమస్య ఉండదు. 
  • ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవద్దు. 
  • బ్రేక్ ఫాస్ట్ – లంచ్ – డిన్నర్ కు మధ్య కనీసం 4-5 గంటలు గ్యాప్ ఉండాలి. 
  • బ్రేక్ ఫాస్ట్ ను కింగ్ లా తినాలి. డిన్నర్ బెగ్గర్ లా తినాలి. అనే సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. 
  • రాత్రి 10 గంటల తర్వాత డిన్నర్ తినొద్దు..

 

Leave a Comment