చికెన్ తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..!

చికెన్ ప్రియులు చాలా మంది ఉంటారు. వారికి చికెన్ చూస్తే చాలా లొట్టలేసుకుని తినేస్తారు. కొంతమందికి రోజూ తినే ఆహారంలో కచ్చితంగా చికెన్ ఉండాల్సిందే..అయితే మాంస ప్రియులకు ఇది షాకింగ్ విషయమే.. చికెన్ ఎక్కువ తినేవారికి తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కోళ్లఫారంలో కోళ్లు మొక్క జొన్నను తింటాయి. దీంతో కోళ్లకు ఫుల్లుగా కొవ్వు పట్టేస్తుంది. ఆ చికెన్ ను మనం తింటే మనకూ అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది. చికెన్ కొద్దిగా తింటే పర్వాలేదు. అదే చికెన్ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. 

చికెన్ ను తెచ్చిన రెండు మూడు గంటల్లోనే వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్ లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటే దానిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అలాంటి చికెన్ తింటే ఆ బ్యాక్టీరియా శరీరంలో చేరి ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. సూపర్ మార్కెట్ లో లభించే ప్రాసెసింగ్ కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యనంలో తేలింది. 

చికెన్ ను ఫ్రై చేసుకుని తినడం కన్నా కర్రీ లాగా తీసుకోవడం మేలు. చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్లి కాన్సర్ సోకేందుకు కారణం అవుతుందని అధ్యయనంలో తేలింది. ఎప్పుడో ఒకసారి ఫ్రై చికెన్ తింటే పర్వాలేదు. రోజూ తింటేనే ప్రమాదం. 

కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. దీని వల్ల కోళ్లు బాగా లావుగా పెరుగుతాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత లావుగా అవుతాయి. వాటిని తింటే మనకు లేనిపోని రోగాలు వస్తాయి. 

అయితే మాంసం ప్రియులు నాన్ వెజ్ తినాలి అనుకుంటే సీ ఫుడ్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చేపలు, రొయ్యలు, వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండడం వల్ల రోజు వారి ఆహారంగా కూడా తీసుకోవచ్చు. ఇక చికెన్ తినాలి అనుపిస్తే మాత్రం నాటు కోడి తినడంం ఉత్తమం..

 

Leave a Comment