శ్రీకృష్ణుడిని కలవాలని.. ఆత్మహత్య చేసుకున్న రష్యన్ యువతి..!

ఆమెకు శ్రీకృష్ణుడు అంటే అమితమైన భక్తి.. ఎలాగైనా  తన ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడిని కలవాలని కోరిక ఉండేది. అందుకోసం ఓ రష్యన్ యువతి ఆరు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు రష్యాలోని రోస్తవ్ నగరానికి చెందిన యువతి తత్యానా హెలోవ్ స్కయ గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్ ధామ్ అపార్ట్మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. 

ఈక్రమంలో ఆమె ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు శ్రీకృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ఆత్మహత్య చేసి ఉండవచ్చని అదే భవనంలో ఉంటున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి ప్రయాణికురాలి వీసా కింది ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్ ఎంబసీకి తెలియజేశారు.  

 

Leave a Comment