టీమిండియా ‘నయా వాల్’కు హ్యాపీ బర్త్ డే..!

టీమిండియాలో నయా వాల్ గా పేరు సంపాదించుకున్న క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా సోమవారం 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తన బ్యాటింగ్ తో టెస్టుల్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా నిరూపించుకున్నాడు.  ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.

అంతే కాదు ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు(ఆసీస్ పై 525) ఎదుర్కొన్న భారత ఆటగాడిగా రికార్డు కూడా పుజారా పేరిట ఉంది. ద్రవిడ్(495), రవిశాస్త్రి(477) సైతం ఇతడి వెనుకే ఉన్నారు. పుజారా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తదితరులు పుజారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

Leave a Comment