‘మీ అబ్బాయికి మీరైనా చెప్పండి’.. ప్రధాని మోడీ తల్లికి రైతు లేఖ..!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా మీ అబ్బాయి మనసు మార్చాలని ప్రధాని మోడీ తల్లిని ఓ రైతు కోరారు. నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు నిర్వహిస్తున్న ఓ పంజాబ్ రైతు హర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కి ఓ భావోద్వేగ  లేఖ రాశారు. కడుపు నింపే అన్నదాతను ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ రోడ్లపై పడుకునే చేస్తున్నారని చెప్పారు. 

ఈ ఆందోళనలో 90 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వయస్సు వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. పిల్లలు, మహిళల కూడా ఉన్నారన్నారు. ఇప్పటి కొంత మంది చనిపోయారని పేర్కొన్నారు. అదానీ, అంబానీ, కార్పొరేట్లకు మేలే చేసేలా ఈ చట్టాలను రూపొందించారని ఆ రైతు లేఖలో వివరించారు. 

‘ఎన్నో ఆశలతో ఈ లేఖ రాస్తున్నాను. మీ అబ్బాయి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆయన ఈ చట్టాలను రద్దు చేయగలరు. నాకు తెలిసి ఎవరూ తల్లి మాటను కాదనరు. ఓ తల్లే తన కొడుకునే ఆదేశించగలదు. ఆ పని చేస్తే దేశం మొత్తం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది’. అంటూ ఆ రైతు లేఖలో పేర్కొన్నారు.  

Leave a Comment