9 నెలల గర్భంతో 1.6 కి.మీ.ల పరుగు..!

9 నెలల గర్భంతో ఉన్న మహిళలకు నడిచేందుకు కూడా కష్టంగా ఉంటుంది.. అలాంటిది 9 నెలల ఓ నిండు గర్భిణి తన పరుగుతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. మకెన్నా మైలర్(28) అనే అమెరికన్ అథ్లెట్ ఆదివారం పరుగు పందెంలో పాల్గొంది. కేవలం 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. 

దానికి సంబంధించిన వీడియోను ఆమె భర్త సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. మెడికల్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో మైలర్ ఈ పరుగును పూర్తి చేసినట్లు సమాచారం. ఆమె కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. ఆమెకు ఈనెల 19న మైలర్ కి డాక్లర్లు డెలివరీ డేట్ ఇచ్చారు. 

Leave a Comment