80 ఏళ్ల వయస్సులోనూ రోటీలు అమ్ముతూ జీవనం..!

పిల్లలు ఉండి కూడా 80 ఏళ్ల వయస్సులో కష్టపడాల్సిన పరిస్థతి ఆమెది. ఉన్న ఇద్దరు కుమారులు పట్టించుకోకపోవడంతో పొట్టకూటి కోసం తానే కష్ట జీవిగా మారింది. ఎవరి మీద ఆధారపడకుండా తనకొచ్చిన పని చేసుకుంటుంది. రోడ్డు పక్కన చిన్న కొట్టు పెట్టుకుని రోటీలు అమ్ముకుంటుంది. కేవలం రూ.20 లకు రోటీ, పప్పు, వెజిటేబుల్ కూర, బియ్యం తాలిని విక్రయిస్తూ ‘రోటివాలి అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. 

భగవాన్ దేవి అనే వితంతువు గత 15 సంవత్సరాలుగా ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజీ సమీపంలో తన చిన్న ఆహార కొట్టును నడుపుతోంది. తనకు ఇద్దరు కుమారులు ఉన్నా వారు సహాయం చేయడం లేదని, తనతో ఎవరైనా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు పక్కన కావడంతో కొట్టు తొలగించాలని ఆదేశాలు కూడా వచ్చాయంది. తనకు శాశ్వత దుకాణం వస్తే ఏదో విధంగా జీవనం సాగిస్తానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Leave a Comment