ఇంటికి రూ.80 లక్షల కోట్ల కరెంటు బిల్లు..

విద్యుత్ సంస్థలు కరెంటు బిల్లులతో వినియోగదారులకు మోత మోగిస్తున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిపివేసిన విద్యుత్ బిల్లులు రెండు నెలల తర్వాత తీస్తుండటంతో ప్రస్తుతం వస్తున్న బిల్లులు ప్రజలకు షాక్ కు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లులు ఇవ్వడంతో రెట్టింపు ఛార్జీలు వస్తున్నాయి. రెండు నెలల రీడింగ్ ఒకేసారి తీయడంతో స్లాబ్ మారి ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా మధ్యప్రదేశ్ లో రూ.80 లక్షల కోట్ల విద్యుత్ బిల్లు రావడంతో వినియోగదారుడు షాక్ కు గురయ్యాడు. సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలోని ఓ ఇంటికి విద్యుత్ అధికారులు రీడింగ్ తీయగా రూ.80 లక్షల కోట్ల బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి యజమాని అవాక్కయ్యాడు. దీనిపై సదరు యజమాని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

Leave a Comment