మళ్లీ వర్క్ ఫ్రం హోం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగతావారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రం హోం ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. కంటైన్ మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని, జ్వరం దగ్గు లక్షణాలు ఉంటే కార్యాలయాలకు రావద్దని స్పష్టం చేసింది.

కొత్త మార్గదర్శకాలు.. 

  • ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధితిలో 20 మంది సిబ్బందికి లేదా అధికారులకు మాత్రమే అనుమతి.
  • సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలి.
  • ఎదురెదురుగా కూర్చోకూడదు..
  • మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి.
  • మాస్క్ పెట్టుకోకుండా వస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు..
  • ఎవరి కంప్యూటర్ కీబోర్డులు వారే శానిటైజర్ తో క్లీన్ చేసుకోవాలి. 

Leave a Comment