80 ఏళ్ల వృద్ధుడికి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు.. బీపీ పెరిగి ఆస్పత్రిపాలు..!

మహారాష్ట్రలో 80 ఏళ్ల వృద్ధుడికి ఆ రాష్ట్ర ఎలక్ట్రీసిటీ బోర్డు షాక్ ఇచ్చింది. అతడికి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు వేసింది. దీంతో షాక్ తిన్న ఆ వృద్ధుడు బీపీ పెరిగి పడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. 

వివరాల మేరకు మహారాష్ట్ర రాష్ట్రం నలసోపారా పట్టణంలోని నిర్మల్ గ్రామంలో గణ్ పత్ నాయక్ అనే 80 ఏళ్ల వృద్ధుడు రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఈక్రమంలో అతడికి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీన్ని చూసిన గణ్ పత్ కి బీపీ పెరిగి కిందపడిపోయాడు. దీంతో అతడికి ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎంఎస్ఈడీసీఎల్ స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పని, బిల్లును త్వరలోనే సరి చేస్తామని తెలిపింది. మీటర్ రీడిండ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఇలా జరిగిందని వెల్లడించింది. ఏజెన్సీ ఆరు అంకెలకు బదులుగా తొమ్మిది అంకెల బిల్లును తయారు చేసిందని, తాము అతడి విద్యుత్ మీటర్ ను అధ్యయనం చేసి వారికి ఆరు అంకెల కొత్త బిల్లును ఇచ్చామని విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే తెలిపారు. 

Leave a Comment