మనిషి ముఖంతో వింత చేప..!

ప్రస్తుతం ఓ వింత చేప సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. షార్క్ కడుపులో పూర్తిగా ఎదగని పిల్ల వింత ఆకారంలో ఉంది. ఇండోనేషియాకు చెందిన అబ్దుల్లా నురెన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 21న తూర్పు నుసా టెంగ్గరలోని రోటోడావోకు చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల విసరగా అందులో ఓ షార్క్ పడింది. 

ఆ షార్క్ ను తీసుకెళ్లి మరుసటి రోజు పొట్టను కోసి చూడగా లోపల మూడు చిన్న షార్క్ చేపలు కనిపించాయి.  అందులో రెండు షార్క్ పిల్లల్లో ఎలాంటి తేడా లేదు. మరొకటి మాత్రం వింతగా ఉంది. ముఖం ఏలియన్ లాగా, కింద కొంత శరీరం మత్స్య కన్యలాగా, మిగిలిన కింద భాగం చేపలాగా ఉంది. దానిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. 

అయితే ఆ షార్క్ విషయం కోడై కూసింది. దీంతో దీన్ని చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. చాలా మంది కొనుక్కుంటామని అడుగుతున్నా అబ్దుల్లా అమ్మడం లేదు. తాము దాన్ని పెంచుకుంటామని తెలిపారు. అది తమకు అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వింత చేప వైరల్ గా మారింది. 

 

Leave a Comment