మొతెరా స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు..!

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు పెట్టారు. ఇంతకు ముందు ఇది సర్దార్ పటేల్ స్టేడియంగా ఉండగా, ఇప్పుడు సర్దార్ పేరును స్పోర్ట్స్ కాంప్లెక్స్ కే పరిమితం చేశారు. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.10 లక్షలు కావడం విశేషం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ సెక్రటరీ జై షా, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మొతేరాలోని సర్దార్ పటేల్ స్పోర్ట్స్ ఎన్ క్లేవ్, నరేంద్ర మోడీ స్టేడియంలకు తోడుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మంచనున్నామని ప్రకటించారు. ఈ మూడు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల అతిథ్యానికి సన్నద్ధమవుతున్నాయన్నారు. అమ్మదాబాద్ భారతదేశ ‘స్పోర్ట్స్ సిటీ’గా ఖ్యాతికెక్కనుందని ఆయన తెలిపారు.  

Leave a Comment