డెలీవరీ కాగానే మహిళలకు రూ.5 వేలు..!

అంగన్‌ వాడీలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  స్కూళ్ల తరహాలోనే నాడు – నేడు కార్యక్రమాల ద్వారా 10 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సేవలను రెండు రకాలుగా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, 36 నెలలోపు శిశువుల కార్యకలాపాలు ఒక వైపు, 36 –72 నెలలల వరకూ పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ప్రీ ప్రై మరీ–1, ప్రీ ప్రై మరీ –2 లపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. 

ఆరోగ్య ఆసరా కింద డెలివరీ కాగానే మహిళళకు రూ.5 వేలు అందించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ కింద అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం పాటిస్తున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌ అన్నీ కూడా ఇక్కడ పాటించేలా చూడాలని సీఎం తెలిపారు.  అంగన్‌వాడీలను సమర్థవంతగా నిర్వహిస్తున్న వారిని పోత్సహించాలన్నారు. సరిగ్గా నిర్వహించని అంగన్‌వాడీలపై సమాచారం ఉన్నతాధికారులకు రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Leave a Comment