టీ కొట్టు యజమానికి రూ.109 కోట్ల జీఎస్టీ బిల్లు..!

అధికారుల నిర్లక్ష్యంతో చిన్న కొట్టు వ్యాపారులకు కూడా జీఎస్టీ బకాయి నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒరిస్సాలో జరిగింది. టీకొట్టు నిర్వహించుకున్న వ్యక్తికి రూ.109 కోట్ల  జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు అందాయి. దీంతో ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. ఉక్కునగరం రౌర్కెలా కోయల్ నగర్ ప్రాంతంలో కార్తీక్ కమిల అనే వ్యక్తి చిన్న టీ బడ్డీ నడుపుకుంటున్నాడు. 

ఈ వ్యక్తికి రూ.109 కోట్లు జీఎస్టీ చెల్లించాలని నోటీసు వచ్చింది. వాస్తవానికి కార్తీక్ కు సంతకం కూడా చేయలేని నిరక్షరాస్యుడు. కుటుంబ పోషణ కోసం అతడు చిన్న బడ్డీ నిర్వహించుకుంటున్నాడు. అయితే నోటీసులో అతడు బడా షాపింగ్ మాల్ యజమానిగా జీఎస్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రిమెంట్ కింద భవంతిని అద్దెకిచ్చనట్లు ఉంది. అందులో కార్తీక్ కమిల సంతకం కూడా ఉంది. 

రౌర్కెలా కోయల్ నగర్ లింగరాజ్ ట్రేడింగ్ కంపెనీ షాపింగ్ మాల్ ఆవరణలో కార్తీక్ టీకొట్టు నిర్వహించుకుంటున్నాడు. టీకొట్టుతో పాటు కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని ట్రేడింగ్ కంపెనీ యజమానిగా పేర్కొనడం, భారీ భవంతి నడుపుతున్నట్లు ఉండటంతో అందరూ నిర్ఘాంతపోయారు. 

దీనిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ విచారణ చేపడుతున్నారు. విచారణలో కార్తీక్ నిజంగానే టీకొట్టు యజమాని అని తేలింది. కార్తీక్ విద్యుత్ బిల్లులు జత చేసి బూటకపు జీఎస్టీ నోటీసులు జారీ చేయించినట్లు భావిస్తున్నారు.

 

 

Leave a Comment