మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా.. తెలంగాణ సర్కార్ ఉత్వర్వులు..!

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించింది. 

మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జరిమానాతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ – 2005, ఐపీసీ సెక్షన్ 188, 51-60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా, ప్రజలు లెక్క చేయడం లేదు. దీంతో జరిమానా విధించాలనే నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న పిల్లలు, యువత తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు అత్యవసరమైత తప్ప బయటకు రావద్దని సూచించింది. 

Leave a Comment