13 ఏళ్ల బాలికతో పెళ్లి, గర్భం.. భర్తపై కేసు పెట్టిన పోలీసులు..!

బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసకొని గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి.. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాల మేరకు జనవరి 13న కర్నాటక రాష్ట్రం ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలో చిన్నేగౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్(24) రాయకోట ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. 

రెండు రోజుల క్రితం ఆ బాలిక ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స కోసం డెంకణీకోట సమీపంలోని పంజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆ బాలికను పరిశీలించిన వైద్యులు గర్భవతి అని ధ్రువీకరించారు. బాలిక మైనర్ కావడంతో క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖాధికారులకు వైద్యులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న నేరంపై భర్త దేవరాజ్ పై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. 

Leave a Comment