24 గంటల్లో రూ.1.15 లక్షల బిల్లు.. ఆపై నిర్బంధం..

హైదరాబాద్ లో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల భయాలను సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే చాలు లక్షల రూపాయాలు కట్టవలసిందే అంటూ ఒత్తిడి తెస్తున్నాయి..లేకపోతే రోగులను ఆస్పత్రుల నుంచి వెళ్లనీయకుండా నిర్బంధిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో ఉన్న తుంబే ఆస్పత్రి వ్యవహారం బయటపడింది. ఏకంగా ప్రభుత్వ డాక్టర్ నే రూ.1.15 లక్షల బిల్లు కట్టాలని నిర్భంధించింది. 

వివరాలు ఇలా ఉన్నాయి…హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రిలో డీఎంవో డాక్టర్ సుల్తానాకు కరోనా రావడంతో ఆమె చాదర్ ఘాట్ లోని  తుంబే ఆస్పత్రిలో చేరారు. అయితే 24 గంటలు ఆస్పత్రిలో ఉన్నందున రూ.1.15 లక్షల బిల్లు వేయడంతో ఆమ్ షాక్ కు గురయ్యారు. ఇదేంటని ఆమె ప్రశ్నించగా..‘నువ్వు డీఎంవో అయితే మాకేంటి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు..నన్ను నిర్భందించారు’ అంటూ ఆమె ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు..కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో జాయిన్ అయితే రోజుకో లక్ష రూపాయలు బిల్ వేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం బిల్ కట్టలేదని అసలు వైద్యం అందించకపోవడమే కాకుండా కనీసం డిశ్చార్జ్ కూడా చేయ్యట్లేదని రోధించారు.

Leave a Comment