పానీపూరి ఏటీఎం.. భలేగా ఉంది కదూ..!

పానీపూరి ప్రియులకు ఇది నిస్సందేహంగా శుభవార్తే.. కరోనా కాలంలో చాలా మంది పానీ పూరిని బాగా మిస్సాయ్యారు. అసలు పిల్లల నుంచి పెద్దల వరకు..ఇక అమ్మాయిలు అయితే ఎంత ఇష్టంగా తింటారో చెప్పనవసరం లేదు. ఇక పానీపూరీ ప్రియులకు మన దేశంలో ఓ వ్యక్తి Pani Puri ATM మెషీన్ ను సృష్టించాడు. ఇది అచ్చం బ్యాంకు ఏటీఎంల మాదిరిగానే ఉంటుంది.

 ఈ  Pani Puri ATMలో గోల్ గప్పా, పుచ్ కా, బటాషా ఇల రకరకాల పేర్లతో పిలిచే పానీ పూరీలు వస్తాయి. కేవలం 20 రూపాయల నోటు ఇందులో వేస్తే చాలు..14 గప్ చుప్ లు వస్తాయట. ఈ Pani Puri ATM యొక్క వీడియోను హార్ది సింగ్ అనే పోలీస్ అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నిజమైన ఇండియన్ యొక్క చాతుర్యత అంటూ పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇక అంతే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. 

ఈ వీడియోలో ఓ వ్యక్తి Pani Puri ATM ఎలా పని చేస్తుందో వివరణ ఇస్తున్నాడు. ఈ యంత్రాన్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందని ఆ వ్యక్తి చెప్పాడు. Pani Puri ATM నుంచి గోల్ గప్పే ఎలా వస్తాయో చూపించాడు. 

 

Leave a Comment