హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత : WHO

కరోనా విషయంలో పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వని మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు హెఐవీ డ్రగ్ లొపినావిర్,  రిటోనావిర్ మందుల క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసినట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్ మరణాల రేటును తగ్గించడంలో ఈ మందులు ప్రభావం చూపడం లేదని పేర్కొంది.

 హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు లొపినావిర్, రిటోనావిర్ మందులను నిలిపివేయాలని సాలిడారిటీ ట్రయల్ ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ WHOకు సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుకు WHO అంగీకరిస్తూ ఆ మందులను నిలిపివేసింది. అయితే ఈ మందుల ద్వారా మరణాల రేటు పెరిగిందనడానికి ఆధారాలు లేవని వివరించింది. ఈ నిర్ణయం ఇతర అధ్యయనాలపై ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. 

 

Leave a Comment