RRR Movie: ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విడుదల..దుమ్ములేపిన జక్కన్న..!

ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోను సినిమా యూనిట్ గురువారం విడుదల చేసింది. ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సన్నివేశాలతో పాటు శ్రియ, అజయ్ దేవగణ్, ఆలియా భట్ ల లుక్ ని చూపించారు. యాక్షన్ సీన్లు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. 

మరీ ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్, ఆ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ అందుకోసం భారీ ఎత్తున వేసిన సెట్లు, వందల మంది యుద్ధ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ గర్జన మాత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. 

 

Leave a Comment