ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతో పాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషనలు అమలు చేస్తూ జీవో జారీ చేసింది. 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈడబ్ల్యూసీ)గా గుర్తిస్తూ చట్టసవరణ తీసుకొచ్చింది.

 2019 జూలై 27న ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

విధివిధానాలు:

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు.
  • కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8లక్షల లోపు ఉండాలి.
  • ఈ డబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్పింది. 
  • ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు.   

 

Leave a Comment