‘దేశ ద్రోహం’ చట్టం మనకు అవసరమా?.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేశ ద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ద్రోహం చట్టాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అది బ్రిటీష్ కాలం నాటి చట్టమని, అది ఇప్పుడు అవసరమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్రిటీష్ వారు గాంధీ లాంటి సమరయోధులను నిలువరించేందుకు ఆ చట్టం తీసుకొచ్చారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఆ వలస చట్టం మనకు అవసరమా? అని సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు. 

రిటైర్డ మేజర్ జనరల్ వోంబాట్కెరె ఐపీసీలోని 124-ఎ సెక్షన్(దేశ ద్రోహం కేసు)ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశద్రోహ చట్టాన్ని బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టంగా ధర్మాసనం పేర్కొంది. దేశ ద్రోహం సెక్షన్ 124-ఎ తొలగింపునకు కేంద్ర ఆలోచించాలని సూచించింది. దేశ ద్రోహ చట్టం దుర్వినియోగం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించట్లేదని ధర్మాసనం పేర్కొంది.

 

Leave a Comment