సల్మాన్ ఖాన్ తోనే శభాష్ అనిపించుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్..!

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి అనే సినిమా ద్వారా వెండితెరపై హీరోగా కనిపించాడు. ఈ సినిమా రోషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈక్రమంలో రోషన్ గురించి తెలుసుకోవడం కోసం చాలా మంది వెతుకులాట మొదలుపెట్టారు. అప్పుడు రోషన్ చేసిన ప్రాజెక్టులు బయటికి వచ్చాయి. రోషన్ ఇటు తెలుగు సినిమా పెద్దలతోనే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజానికి రోషన్ ని మరో రెండు మూడు ఏళ్ల పాటు సినిమాకు దూరంగా ఉంచాలని తండ్రి శ్రీకాంత్ అనుకున్నారట. కానీ డిప్లమా పూర్తియన వెంటనే రోషన్ అనుభవం కోసమని ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్ 3’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. ఆ సమయంలో అక్కడి తారలు, సిబ్బంది రోషన్ పనిని చాలా మెచ్చుకునేవారు. అతడు ఏ పని అయినా అంకితభావంతో చేస్తాడని కితాబిచ్చారట. రోషన్ ముఖ పోలికలు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను పోలి ఉంటాయి. దీంతో బాలీవుడ్ లో అందరూ రోషన్ ను హృతిక్ రోషన్ తో పోల్చేవారని తెలిసింది..      

 

Leave a Comment