ఘనంగా జబర్దస్త్ ముక్కు అవినాష్ పెళ్లి..!

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ పెళ్లి వేడక ముగిసింది. అవినాష్ తన చిన్ననాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు వేశాడు. కుటుంబ సభ్యులు, కొద్ద మంది నటీనటుల మధ్య అవినాష్ పెళ్లి వైభవంగా జరిగింది. బిగ్ బాస్ బాజీ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్ తో పాటు పలువురు ఈ పెళ్లి వేడుకు హాజయర్యారు. 

ఇక సహ నటుడు రాంప్రసాద్ అవినాష్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేసి అందరికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ రాంప్రసాద్ ముందుగానే ‘సారీ బ్రదర్..ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.   

Leave a Comment