పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టారు.. యువతి సెల్ఫీ వీడియో వైరల్..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్య్రమంలో గందరగోళం నెలకొంది. నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోట నిరోష ఉద్యోగ ప్రకటనపై ఆ కార్యక్రమంలో ప్రశ్నించింది. దీంతో నాయకులు, పోలీసులు ఆ యువతిని సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనను సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. పోలీసులు తనను ఇష్టమొచ్చినట్టు కొట్టారని వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడే వేస్తారని అడిగానని, అందుకు అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్లు రూ.10 లక్షలు ఇచ్చి పంపించారా అని బెదరించారని యువతి ఆరోపించింది. అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు తనను ఇష్టమొచ్చినట్లు లాగి కొట్టారని, మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా పోయిందని ఆ యువతి చెప్పింది. చేతులు, కాళ్లు పట్టుకొని కదలనివ్వకుండా చేశారని, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు మాట్లారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులందరూ కేసీఆర్ తొత్తులుగా మారారని వీడియోలో కంటతడి పెట్టింది.   

అయితే ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరోషకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ యువతితో ఆయన ఫోన్ లో వివరాలు తెలుసుకున్నారు. ఎవరికి భయపడవద్దని, ధైర్యంగా కేసు పెడతానని సూచించారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. 

Leave a Comment