చౌటప్పల్ లో కారు బీభత్సం : పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్న ప్రేమజంట దుర్మరణం..!

 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి వరుసగా రెండు బైకులు, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ తగల పడిపోగా, యువతి అక్కడిక్కడే మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. 

కాగా, హయాత్ నగర్ కు చెందిన నాగరాజు, శ్రీలత అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరు చెరువుగట్టు వద్ద ప్రేమ వివాహం చేసుకునేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రేమికులు ఇద్దరు ప్రాణాలు విడిచారు. పెళ్లితో ఒక్కటయ్యేందుకు వెళ్తున్న శ్రీలత, నాగరాజు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.