వేడి నీటితో స్నానం చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..

వేడి నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే చాలా మంది వేడి నీటి స్నానం కంటే చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది అంటారు.. అయితే వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

వేడి నీటి స్నానం వల్ల ప్రయోజనాలు..

  • నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్న వారు పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది.
  • వేడి నీటి స్నానం గుండెకు సరైన రక్త ప్రసరణ అందిస్తుంది. అందువల్ల వేడి నీటితో స్నానం చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
  • వేడి నీటి స్నానం బరువును తగ్గించడంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వేడి నీటి స్నానం దాదాపు 30 నిమిషాల పాటువాకింగ్ చేయటంతో సమానమట.. అది ఎలా అంటే.. వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో వేడి పుట్టి అదనపు కేలరీలు కరుగుతాయి. అయితే వేడి నీటి స్నానం చేసినప్పుడు కూడా శరీరంలో వేడి పుట్టి కేలరీలు కరిగి బరువు తగ్గేలా చేస్తుంది. 
  • ప్రతి రోజు వేడి నీటితో స్నానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి, తలనొప్పి పొయి మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
  • రోజు మొత్తం పని చేసి అలసిపోయిన వారు వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో పాటు శరీరాన్ని మళ్లీ ఎనర్జీ మోడ్ లోకి తీసుకొస్తుంది. 
  • అయితే మంచిది కదా అని బాగా మరిగే నీటితో స్నానం చేయకూడదు. ఓ మాదిరి వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలి. 

Leave a Comment