ఆర్వో ప్యూరిఫైయర్లను నిషేధించాలి : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్

ఆర్వో ప్యూరిఫైయర్లను నిషేధించే నోటిఫికేషన్ ను ఈ ఏడాది చివరి నాటికి జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. టీడీఎస్ లీటర్ కు 500 మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉన్న ఆర్వో ప్యూరిఫైయర్లను నిషేధించాలని చెప్పింది. తమ ఆదేశాలను పాటించడంలో ఆలస్యం చేయడం వల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హాని కలుగుతుందన, దీనిని త్వరగా పాటించాలని కోరింది. కరోనా వైరస్ కారణంగా ఎన్జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం డిసెంబర్ 31 వరకు బ్యాన్ చేయాలని చెప్పింది. 

సాధారణంగా మనం తాగే నీటిలో మినరల్స్ ఉంటాయి. ఆర్వో ప్యూరిఫైయర్లు ఈ మినరల్స్ ను పూర్తిగా తొలగిస్తాయి. బయటి నుంచి మినరల్స్ ఆ నీటిలో కలపుతారు. దీనిని మనం మినరల్ వాటర్ అంటూ తాగుతుంటాము. అయితే ఈ నీటిలో మనకు దక్కాల్సిన ఖనిజాలు లభించడం లేదు. దీంతో ఆర్వో ప్యూరిఫైయర్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. 

ఎన్జీటి ఉత్తర్వులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలో నాలుగు నెలలు సమయం కోరింది. అయితే ఎన్జీటి ఉత్తర్వులను కేంద్రం అమలు చేయలేదు. దీంతో డిసెంబర్ వరకు గడువు పొడిగించింది. 

ఇక్ ఆర్వో ప్యూరిఫైయర్ల పనితీరును నిపుణుల కమిటీ పరిశీలించింది. అవి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిలో ఖనిజాలు ఉండట్లేదని తేల్చింది. ఖనిజాలు లేని నీటిని తాగితే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొంది. లీటర్ నీటిలో టీడీఎస్ 500 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండకూడదని స్పష్టం చేసింది. 

 

Leave a Comment