భార్యలు..వాళ్లలో రకాలపై  రామ్ గోపాల్ వర్మ వెబ్ సిరీస్..!

48
RGV Web Series

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్యలు, వాళ్లలో రకాలపై ఓ వెబ్ సిరీస్ తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ ని తెరకెక్కించబోతున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ సిరీస్ లో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలకపాత్ర చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు..

‘భరతముని, కేశవదాసు, జయదేవుడు, వనమాలి లాంటి ఇంకా ఎందరో శతాబ్దాల కిందటి మహానుభావులు.. లోకంలో ఎన్ని రకాల స్రీలు ఉన్నారో వాళ్ల వాళ్ల వర్గీకరణను సుదీర్ఘంగా విపులీకరించారు. కానీ, ఆ స్త్రీల అసలు స్వరూపం భార్యలుగా మారినప్పుడే బయటకొస్తుంది’ అంటూ ఆర్జీవీ అంటున్నారు. 

లోకంలో రకరకాల భార్యలు ఉంటారని వాళ్లను పెళ్లి చేసుకున్న భర్తలకు మాత్రమే తెలుసని ఆర్జీవీ తెలిపారు. భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు వివరించారు. 

ఒక మగాడికి ఎలాంటి భార్య దొరకితే అతని బతుకు ఎలా తయారవుతుందో చూపించడమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.  అంతేకాదు.. ఈ సిరీస్ లో చూపించబోయే భార్యల రకాల గురించి కూడా ఆర్జీవీ వివరించారు. సీజన్ -2లో ‘రకరకాల భర్తలు’ సిరీస్ కూడా తెరకెక్కించనున్నట్లు ఆర్టీవీ ప్రకటించారు.  

Previous articleవివాదానికి తెర : కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు..!
Next articleరామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here