వర్మ మోసాన్ని పసిగట్టిన గూగుల్ తల్లి..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇటీవల వరుసగా హాట్ సినిమాలను తీస్తూ కుర్రకారులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక తను తీస్తున్న సినిమా హీరోయిన్ల హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మియా మాల్కోవాతో క్లైమాక్స్ చేసిన వర్మ, నాక్డ్ చిత్రంతో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీరాపాకను హీరోయిన్ గా పరిచయం చేశాడు. 

తాజాగా వర్మ Apsara Rani హీరోయిన్ గా పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేశారు. Apsara Raniతో థ్రిల్లర్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా..ఎవరబ్బా ఈ Apsara Rani అంటూ గూగుల్ సెర్చ్ చేశారు. గూగుల్ నుంచి ఈ Apsara Raniబయోడేటాను బయటకు తీశారు. 

ఇంకేముంది..గూగుల్ తల్లి వర్మ మోసాన్ని మొత్తం బయటపెట్టేసింది. వర్మ పరిచయం చేస్తున్న ఈ అమ్మాయి ముందుగానే తెలుగులో రెండు సినిమాలు చేసింది. Apsara Rani అసలు పేరు Ankita Maharana..గతంలో ‘4 లెటర్స్’, ‘ఉల్లాల్లా.. ఉల్లాల్లా’ అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు అంతగా ఆడలేదు. అందుకు ఆమె పెద్దగా గుర్తులేరు. అయితే ఏడాది నుంచి ఆమెతో వర్మకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. ‘ఉల్లాల్లా..ఉల్లాల్లా’ సినిమా ఆడియో లాంచ్ వర్మ చేతుల మీదుగా జరిగింది. అప్పుడే Ankita Maharanaపై కన్నేసిన వర్మ తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. 

Leave a Comment