హజ్ యాత్రకు ప్రత్యేక గైడ్ లైన్స్ జారీ..!

హజ్ యాత్ర గురించి వినని వారుండరు. హజ్ యాత్ర ముస్లింలకు చాలా పవిత్రమైంది. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని ఉంటుంది. ఈ హజ్ యాత్ర ఈ నెలలో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం హజ్ యాత్రకు లక్షలాది ముస్లింలు వెళ్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తున్నారు. అంతే కాదు..ఈ సారి బయటి దేశాల నుంచి ఎవరిని అనుమతించడం లేదు. కేవలం సౌదీ ప్రజలను మాత్రమే హజ్ కోసం అనుమతిస్తున్నారు. అయితే సౌదీలో నివసిస్తున్న ఇతరులకు అవకాశం ఇస్తున్నారు.  హజ్ యాత్ర కోసం అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేక గైడ్ లైన్స్ జారీ చేసింది. 

హజ్ యాత్ర యొక్క గైడ్ లైన్స్..

  • ఈసారి జమ్ జమ్ బావి పవిత్ర జలాన్ని ప్లాస్టిక్ బాటిళ్లో ఇవ్వనున్నారు. 
  • కాబాలో విసిరే గులక రాళ్లను ముందుగానే స్టెరిటైజ్ చేసి సీల్ చేసిన బ్యాగ్ లో ఇవ్వనున్నారు. మాములుగా ఈ రాళ్లు హజ్ యాత్ర మార్గంలో లభిస్తాయి. వీటిని విసరడం ద్వారా చెడును తరిమేస్తారు. ఈ రాళ్లను యాత్రకు వెళ్లిన రోజే ఇస్తారు.
  • కాబాలో నల్ల రాయిని యాత్రికులు ఎవరూ తాకకూడదు. తవ్వాఫ్ సమయంలో ఒకటిన్నర మీటర్ల దూరం ఉండాలి.
  • యాత్రికులు స్వయంగా జానిమాజులు తెచ్చుకోవాలి. యాత్రికులు మాస్కులు తప్సనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. 
  • మసీదులో బయటి నుంచి ఆహారం అనుమతించరు. యాత్రికులకు ప్యాక్ చేసిన ఆహారం ఇస్తారు. 
  • యాత్రికులకు ధెర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. 
  • తోపులాడ జరగకుండా ఎంట్రీ, ఎగ్జిట్ కోసం పత్య్రేక మార్గాలను సిద్ధం చేశారు. 

ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 2 మిలియన్ల మంది ముస్లింలు హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాకు చేరుకునేవారు. అయతే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడితే వైరస్ సంక్రమణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సౌదీ ప్రభుత్వం హాజీల సంఖ్యను పరిమితం చేసింది.  

Leave a Comment