WHOకు అమెరికా గుడ్ బై..

కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికాకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ గురించి  WHO తప్పుడు సమాచారం ఇచ్చిందని, చైనాకు వత్తాసు పలుకుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకునే ప్రక్రియను ట్రంప్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే పూర్తి ఉపసంహరణకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. 

కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలను అలర్ట్ చేయకపోవడంతో WHOపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే..అంతే కాదు whoకు అమెరికా నుంచి నిధులను కూడా స్తంభింప చేశాడు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు నోటిఫికేషన్ అందిందని, ట్రంప్ ప్రభుత్వ చర్య అమెరికన్లకు ఏ మాత్రం ప్రయోజనకర కాదని సెనెటర్ బాబ్ మెనెండెజ్ విమర్శించారు. దీని వల్ల అమెరికా ఏకాకి అయిపోతుందన్నారు.

ఇక నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా నిలబచిన జో బిడెన్ కూడా ఓ ట్విట్ చేశారు. తాను గెలిస్తే అమెరికాను తిరిగి whoలో చేరుస్తానని చెప్పాడు.  

 

Leave a Comment